- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడో పెళ్లికి రెడీ అయిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. వరుడు ఎవరో తెలుసా?
మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె మొదట ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయి చిరంజీవి దగ్గరకు చేరింది. ఇక కూతురు బాధ చూడలేక చిరు యంగ్ హీరో కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. అయితే కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొద్ది కాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నారు.
తన ఇద్దరు కూతుళ్లతో శ్రీజ చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీజకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీజ, వరుణ్ తేజ్ వెడ్డింగ్ తర్వాత మూడో పెళ్లి చేసుకోబోతుందట. అబ్బాయి చిరంజీవి బంధువుల అబ్బాయితో ఆమె ఏడడుగులు వేయబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో ఆ వార్త మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమె పెళ్లి చేసుకోకుండా ఇద్దరు కూతుళ్లను చూసుకుంటూ ఉండడం బెటర్ అని అంటున్నారు.
- Tags
- Sreeja Konidela






