- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైరసీపై సజ్జనార్ చూపిన చొరవ అభినందనీయం: చిరంజీవి
పైరసీపై సజ్జనార్ చూపిన చొరవ అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమపై చాలా మంది ఆధారపడ్డారని వారి కష్టాన్ని అప్పనంగా దోచుకుంటే బాధగా ఉందన్నారు. కేవలం పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్ లే కాకుండా గేట్ మ్యాన్ నుండి లైట్ బాయ్ వరకు ప్రతిఒక్కరూ నష్టపోతున్నారని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: పైరసీపై సజ్జనార్ చూపిన చొరవ అభినందనీయం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రమపై చాలా మంది ఆధారపడ్డారని వారి కష్టాన్ని అప్పనంగా దోచుకుంటే బాధగా ఉందన్నారు. కేవలం పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్ లే కాకుండా గేట్ మ్యాన్ నుండి లైట్ బాయ్ వరకు ప్రతిఒక్కరూ నష్టపోతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పైరసీ నుండి తప్పించుకోవాలని చూస్తున్నామని చెప్పారు. అందరి సహకారంతో అది త్వరలోనే నెరవేరుతుందని దీమా వ్యక్తం చేశారు.
సినిమాలను పైరసీ చేస్తూ తిరిగి పోలీసులకే సవాల్ విసరడాన్ని తట్టుకోలేకపోయామని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో సీపీ సజ్జనార్ ఎంతో కృషి చేసి నిందితున్ని పట్టుకున్నాడని అన్నారు. ప్రజలు కూడా సినిమా తమది అని భావించాలన్నారు. పైరసీ సినిమాల జోలికి వెళ్లవద్దని చెప్పారు. ఈ ఏడాది చాలా సినిమాలు పైరసీ చేశారని, దానివల్ల ఎంతో నష్టం జరిగిందని తెలిపారు. ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందించారు.
Read More... CP Sajjanar: 50 లక్షల మంది ఐబొమ్మ యూజర్ల డేటా చోరీ.. సీపీ సజ్జనార్ సంచలన విషయాలు వెల్లడి






