నీ పిల్లలు చనిపోవాలంటూ ట్రోలింగ్.. సీపీ సజ్జనార్‌కు సింగర్ చిన్మయి ఫిర్యాదు

by Ajay Maddhiboyina |

సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలం వాడుతూ కామెంట్స్ చేస్తున్నారని టాలీవుడ్ సింగర్ చిన్మయి సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఆకతాయిలు స్పేస్ నిర్వ‌హిస్తూ చిన్మ‌యిపై దారుణ‌మైన కామెంట్లు చేశారు.

నీ పిల్లలు చనిపోవాలంటూ ట్రోలింగ్.. సీపీ సజ్జనార్‌కు సింగర్ చిన్మయి ఫిర్యాదు
X

దిశ‌, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలం వాడుతూ కామెంట్స్ చేస్తున్నారని టాలీవుడ్ సింగర్ చిన్మయి సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఆకతాయిలు స్పేస్ నిర్వ‌హిస్తూ చిన్మ‌యిపై దారుణ‌మైన కామెంట్లు చేశారు. ఫెమీనిస్టుల‌కు పిల్ల‌లు పుట్ట‌కూడ‌ద‌ని, పుట్టినే వెంట‌నే చ‌నిపోవాల‌ని అన్నారు. లేదంటే వాళ్ల‌ను స‌రిగా పెంచ‌రు అంటూ వ్యాఖ్యానించారు. సింగ‌ర్ చిన్మ‌యి పేరు ఎత్తుతూ బూతులు తిట్టారు.

దీంతో చిన్మ‌యి ఎక్స్ వేధిక‌గా సీపీ స‌జ్జ‌నార్ కు ఫిర్యాదు చేశారు. త‌న పిల్ల‌లు చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని, ద‌య‌చేసి గ‌మ‌నించాల‌ని కోరారు. ఇలాంటి వాళ్ల వేధింపుల‌తో విసిగిపోయాన‌ని తెలిపారు. వాళ్ల‌కు ఏదైనా అభిప్రాయం న‌చ్చ‌క‌పోతే వ‌దిలేయాల‌ని అన్నారు. తాను పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని 15ఏళ్లైనా స‌రే చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకోనివ్వాల‌ని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో చిన్న‌యి ట్వీట్ కు స‌జ్జ‌నార్ స్పందించారు. సైబ‌ర్ క్రైం పోలీసులు, హైద‌రాబాద్ పోలీసుల‌ను విచార‌ణ జ‌రపాల‌ని ఆదేశించారు. దీంతో చిన్మ‌యి స‌జ్జ‌నార్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story