‘చికిరి చికిరి’ ఇండస్ట్రీ రికార్డ్

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-11 17:09:03  IST  )

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి

‘చికిరి చికిరి’ ఇండస్ట్రీ రికార్డ్
X

దిశ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ అదిరిపోగా.. ఈ మధ్య రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ఆడియన్స్‌కు థాంక్స్ చెప్తూ నోట్ షేర్ చేసింది మూవీ యూనిట్. ‘మీకు థాంక్స్ చెప్పేందుకు మాటలు సరిపోవడం లేదు. చికిరి చికిరిపై మీరు కురిపించిన ప్రేమతో సెన్సేషన్ క్రియేట్ అయింది. 24 గంటల్లో హైయ్యెస్ట్ వ్యూడ్ ఇండియన్ సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 150 మిలియన్ ప్లస్ వ్యూస్, 1.8 మిలియన్ లైక్స్‌తో దూసుకుపోతుంది. యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై, గ్లోబల్ యూట్యూబ్ చార్ట్స్‌లో టాప్‌గా నిలిచింది. మిలియన్‌కుపైగా రీల్స్, షాట్స్ ‘చికిరి చికిరి’ వైబ్‌ను సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పేందుకు ఉదాహరణగా నిలిచాయి. ఈ రికార్డ్‌కు కారణమైన హీరోహీరోయిన్లు, నటీనటులు, టెక్నిషియన్లకు థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత.

Next Story