- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandu Mondeti: చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఆమని సినిమాపై చందూ మొండేటి కామెంట్స్
సీనియర్ నటి ఆమని (Amani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మాండ’

దిశ, సినిమా: సీనియర్ నటి ఆమని (Amani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మాండ’ (Brahmanda). తెలంగాణ (Telangana) జానపద కళారూపం ఒగ్గు కథ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాంబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై దాసరి సురేష్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. తాజాగా ‘బ్రహ్మాండ’ టీజర్‌ను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ()Chandu Mondeti రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది.. అన్ని టీజర్ డిజైన్స్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సినిమా యూనిట్ అందరికి అల్ ది బెస్ట్’ అని అన్నారు. నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ.. ‘మా బ్రహ్మాండ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించిన చందు మొండేటికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అన్నారు.
చిత్ర దర్శకుడు రాంబాబు (Director Rambabu) మాట్లాడుతూ.. ‘మా సినిమా టీజర్ (Teaser) ఆవిష్కరించిన చందు మొండేటికి థాంక్స్. ఇది నా మొదటి విజయంగా భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ అండ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అండ్ డివోషనల్ థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి’ అని తెలిపారు. ఈ చిత్రంలో జయరామ్, కొమరం బన్నీ రాజ్, కనిక వాద్య, జోగిని శ్యామల, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, దిల్ రమేష్, అమిత్, ఛత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్, అనంత్ కిషోర్ దాస్, ఐడ్ల మధుసూదన్ రెడ్డి, మీసం సురేష్, దేవి శ్రీ తదితరులు నటిస్తున్నారు.






