- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరిగి ప్రేమించడం బాగోగులు చూడడం మన బాధ్యత.. చంద్రబోస్ ఆసక్తికర కామెంట్స్
శునకం మనిషికి అత్యంత ఆత్మీయ నేస్తమని నిస్వార్ధంగా మనల్ని ప్రేమించే వాటిని తిరిగి ప్రేమించడం బాగోగులు చూడడం మన బాధ్యత టాలీవుడ్ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు.

దిశ, సినిమా: శునకం మనిషికి అత్యంత ఆత్మీయ నేస్తమని నిస్వార్ధంగా మనల్ని ప్రేమించే వాటిని తిరిగి ప్రేమించడం బాగోగులు చూడడం మన బాధ్యత టాలీవుడ్ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అన్నారు. నగరంలోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 11లో ఏర్పాటు చేసిన కొత్త, అత్యాధునిక డాగీ విల్లే ని వ్యవస్థాపకురాలు అమృత వర్షిణి నల్ల తో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ఇక్కడి డాగీ విల్లులో ముఖ్యంగా శునకాలను ఎక్కడా బంధించి ఉంచకుండా స్వేచ్ఛగా విహరించే వాతావరణం కల్పించడం బాగుందన్నారు.
శునకం పరిమాణం, వయస్సు స్వభావాన్ని బట్టి వాటికి వేర్వేరు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ సెంటర్ ను చూసి తనలో కలిగిన భావోద్వేగాలని ఆయన అప్పటికప్పుడు ఓ పాట రూపంలో ఆకట్టుకునేలా పాడి వినిపించారు. డాగీ వల్ల వ్యవస్థాపకురాలు అమృత వర్షిణి నల్ల మీడియాతో మాట్లాడుతూ.. డాగీ విల్లాలో కేజ్-ఫ్రీ బోర్డింగ్, డే కేర్, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, స్పా, బిహేవియర్ థెరపీ, డాగ్ బోర్డింగ్, గ్రూమింగ్, డాగ్ వాకర్, స్పా వంటి అనేక రకాల సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రత్యేకంగా రూపొందించబడిన వాతావరణంలో శునకాల బాగోగులు చూసుకోవడం మాత్రమే కాకుండా వాటికి శిక్షణ ఇవ్వడానికి సంరక్షించడానికి తాము పూర్తి అంకితభావంతో దీనిని ఏర్పాటు చేశామని తెలిపారు.






