అన్ని మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఛాంపియన్ మూవీ ట్రైలర్.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |

రోషన్(Roshan), అనస్వర రాజన్(Answara Rajan) జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'(Champion).

అన్ని మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్న ఛాంపియన్ మూవీ ట్రైలర్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రోషన్(Roshan), అనస్వర రాజన్(Answara Rajan) జంటగా నటిస్తున్న సినిమా 'ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Advaith) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి(Kalyan Chakravarthy), అర్చన(Archana) కీలక పాత్రల్లో నటించారు. ఇక మిక్కీ జే మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గిరగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్(Trailer) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ 8 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ వారు తన ఎక్స్‌లో తెలుపుతూ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు.

‘ఛాంపియన్ పై ఉన్న ఆరోపణలు ఉరుములతో కూడిన దాడితో పేలిపోయాయి.. ఛాంపియన్ ట్రైలర్ YouTubeలో 8 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు ట్రెండింగ్‌ను దాటింది.. డిసెంబర్ 25 నుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది’ అని రాసుకొస్తూ రోషన్ సీరియస్ మోడ్‌లో గన్ పట్టుకొని కాలుస్తున్న ఫొటో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story