మెగా పవర్‌స్టార్ ‘పెద్ది’ మూవీకి సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-20 11:26:35  IST  )

ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘పెద్ది’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

మెగా పవర్‌స్టార్ ‘పెద్ది’ మూవీకి సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను, యూట్యూబ్‌ను షేక్ చేయడంతో పాటు రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ‘పెద్ది’ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు U/A సర్టిఫకెట్ జారీ చేశారు. ఇక ఈ చిత్రం రన్‌టైన్ విషయానికొస్తే..సుమార్ 3గంటల 2 నిమిషాలు ఉన్నట్లు సమాచారం.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుందని టాక్. గూస్‌బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్‌తో సినిమా అదిరిపోయిందంటున్న ఇన్‌సైడ్ టాక్. జూన్ 4న రాబోతుండగా.. ఒకరోజే ముందుగానే జూన్ 3న ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు పెద్ది రాబోతుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సెనా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండటం విశేషం.

Next Story