Sithara Entertainments: పెద్ద తెరపై మెరిసే అవకాశం.. బంపర్ ఆఫర్ ప్రకటించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్

by Chukka Sudharani |

సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలి అనుకునే వాళ్లకు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Sithara Entertainments: పెద్ద తెరపై మెరిసే అవకాశం.. బంపర్ ఆఫర్ ప్రకటించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలి అనుకునే వాళ్లకు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు నూతన నటీనటులు కావాలంటూ ఓ నోట్ షేర్ చేసింది. నటనపై ఆసక్తి ఉండి సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే యువతీయువకులకు ఇది ఒక మంచి అవకాశం అని తెలుపుతూ.. తమ బ్యానర్‌లో నిర్మించబోతున్న ప్రొడక్షన్ నెం. 37లో నటించేందుకు మేల్ లీడ్స్ (ఏజ్: 18 సంవత్సరాల నుంచి 24), ఫీమేల్ లీడ్స్ (ఏజ్: 20 సంవత్సరాల నుంచి 50) కాలాలని ప్రకటించింది. పెద్ద తెరపై మెరిసే అవకాశం మీ కోసం సిద్ధంగా ఉంది.. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఈ రోజే మీ ప్రొఫైల్‌లను [email protected] లో షేర్ చేయండి.. అలాగే WhatsApp: 8801990954 కు పంపండి అంటూ తెలిపింది. లింక్


Next Story