- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
“బిజినెస్ మ్యాన్” రీ-రిలీజ్ టీజర్ విడుదల
సూపర్‌స్టార్ మహేష్ బాబు “బిజినెస్‌మ్యాన్” రీ-రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రీ-రిలీజ్ టీజర్‌కు అంచనాలను

దిశ, వెబ్ డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు “బిజినెస్‌మ్యాన్” రీ-రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రీ-రిలీజ్ టీజర్‌కు అంచనాలను మించే స్థాయిలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ, ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ అందించిన బీట్స్ అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. థమన్ కంపోజ్ చేసిన ప్రతి పాట కూడా సినిమాకి ఎనర్జీని పెంచుతూ, మహేష్ బాబు స్టైల్‌ను మరింత హైలైట్ చేసింది. తాజాగా విడుదలైన రీ-రిలీజ్ పోస్టర్‌లో మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌తో కనిపించడం, బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న సింహం “సూర్య భాయ్” పవర్‌ను ప్రతిబింబించడం అభిమానుల్లో భారీ ఎగ్జైట్‌మెంట్‌ను రేపింది. కాగా,2012లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన బిజినెస్ మ్యాన్” నవంబర్ 29వ తేదీన రీ-రిలీజ్ కానుంది.






