- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brahmanandam: మోహన్ బాబు అంటే నచ్చడు.. ఆయన అంటేనే చిరాకు.. స్టేజ్‌పైనే షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ స్టార్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’.

దిశ, సినిమా: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ఈ భారీ బడ్జెట్ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. అక్షయ్, మోహన్‌లాల్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, శివ బాలాజీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ మూవీపై ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలకు క్రియేట్ చేసింది. ఇక హై ఎక్స్‌పెక్టేషన్ మధ్య ఈ చిత్రం జూన్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుసగా మీడియాతో ముచ్చటిస్తూ సందడి చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో బ్రహ్మానందం మోహన్ బాబుపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మేరకు యాంకర్ సుమ.. ‘మోహన్ బాబు సినిమాలను మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేయాలనుకుంటే.. మీరు ఏ సినిమా చేస్తారు’ అని బ్రహ్మానందాన్ని ప్రశ్నిస్తుంది. దీనికి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ రౌడీ సినిమా చేస్తాను. ఎందుకంటే ఆ సినిమాకు ఫస్ట్ నన్నే అడిగారు. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసా.. ఇక ఆ తర్వాత మోహన్ బాబు వచ్చి నేను ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాను అని ప్రాదేయపడితే సర్లే చేసుకో అని చెప్పాను’ అంటారు. తర్వాత మోహన్ బాబులో మీకు నచ్చేది ఏంటీ, నచ్చనిది ఏంటీ అని ప్రశ్నించగా.. ‘నచ్చే విషయం లేదు... నచ్చని విషయం లేదు. అసలు మోహన్ బాబే నచ్చడు నాకు’ అని అన్నారు. దీంతో సుమ.. మీరు చెప్పేవన్ని సరదాకి అని మీకు మోహన్ బాబు అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు అనగా.. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘అవును మరి.. ఒక మహానటుడిని ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు’ అని చెప్పుకొచ్చాడు. లింక్






