- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'రెహమాన్ డకైత్'తో బ్రహ్మానందం
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా, బ్రహ్మానందంను కలుసుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోను బ్రహ్మానందం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ధురందర్ మేనియా నడుస్తోంది. పోయిన ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్ర మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇందులో హీరోగా నటించిన రణవీర్ సింగ్ తో సమానమైన గుర్తింపును రెహమాన్ డకైత్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా దక్కించుకున్నారు. ఈ చిత్రంతో ఆయనకు ఇండియా వ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక మార్చ్ 19న ధురంధర్: ది రివెంజ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో కేవలం నాలుగు రోజుల్లోనే 700 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా, టాలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందంను కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను బ్రహ్మానందం తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా, ప్రస్తుతం అది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.






