- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే స్పెషల్.. నేను రెడీ నుంచి బ్రహ్మానందం పోస్టర్ రిలీజ్
‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘నేను రెడీ’.

దిశ, సినిమా: ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘నేను రెడీ’. హవీష్ హీరోగా నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా వచ్చిన టీజర్ ఎంటర్‌టైనింగ్ కథాంశాన్ని పరిచయం చేస్తూ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆంధ్ర అబ్బాయికి, తెలంగాణ అమ్మాయితో నిశ్చితార్థం జరగడం, దానివల్ల కల్చర్, లైఫ్ స్టైల్ మధ్య హిలేరియస్ కాన్‌ఫ్లిక్ట్‌కి దారితీయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో ఈ సినిమా టీజర్ రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రంలోనే బ్రహ్మానందం బర్త్‌డే సందర్భంగా ‘నేను రెడీ’ చిత్రం నుంచి ఆయన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘పెద్ద తెరపై హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ట్రేడ్‌మార్క్ హాస్యాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.






