- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
26 కేజీల బరువు తగ్గిన హీరోయిన్ తండ్రి!
సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప ఫ్యామిలీ లు ఉన్నాయి. ఇందులో కొన్ని కుటుంబాలకు సంబంధించిన వారసులు

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప గొప్ప ఫ్యామిలీ లు ఉన్నాయి. ఇందులో కొన్ని కుటుంబాలకు సంబంధించిన వారసులు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నారు. అలాంటి వారిలో బోనీ కపూర్ ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. నిర్మాతగా బోనీ కపూర్ (Boney Kapoor)... ఆ తర్వాత శ్రీ దేవి ఒకప్పుడు హీరోయిన్ గా దుమ్ము లేపారు. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ కూడా ఇండస్ట్రీని దున్నేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న బోని కపూర్.. తన రూపాన్ని మొత్తం మార్చేసుకున్నాడు. 69 సంవత్సరాల వయసులో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఏకంగా 26 కేజీల బరువు తగ్గారు ఈ నిర్మాత బోనీ కపూర్. వ్యాయామాలు అలాగే కఠినమైన ఆహారపు అలవాట్లు... ఫాలో అయి ఏకంగా 26 కేజీలు తగ్గిపోయారు.
ఆయన రాత్రిపూట మొత్తం మానేసి.. కేవలం సూపులు మాత్రమే... తాగేవారని తెలుస్తోంది. ఉదయం పూట జొన్న రొట్ట, పండ్లు, ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తాగేవారట. 69 సంవత్సరాల వయసులో కూడా.... ఇలాంటి డైట్ పాటించి బరువు తగ్గడం మామూలు విషయం కాదు. కానీ బోనీకపూర్ మాత్రం.. ఈ విషయంలో చాలా కష్టపడ్డాడని ఈ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.






