- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varun Dhawan: ‘నరకానికి వెళ్లే దారి స్వర్గంలా అనిపిస్తుంది’: వరుణ్ ధావన్
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ (Bollywood star hero Varun Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ (Bollywood star hero Varun Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక హిందీ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న హీరోల్లో వరణ్ ధావన్ ఒకరు. ఈ హీరో 2010 లలో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించారు కూడా.
టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో వరుణ్ ధావన్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వీటితో పాటు రొమాంటిక్ కామెడీలు మై తేరా హీరో, హంప్టీ శర్మ కీ దుల్హానియా, బద్రీనాథ్ కీ దుల్హానియా, యాక్షన్ కామెడీలు దిల్‌వాలే, డిషూమ్, జుడ్వా 2, డ్యాన్స్ ఫిల్మ్ ABCD 2, డ్రామా సుయి ధాగాలలో ప్రధాన పాత్రలతో నటించి మెప్పించాడు.
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ బద్లాపూర్‌లో ధావన్ తన భార్య అలాగే కొడుకు హత్యకు 15 సంవత్సరాల పాటు ప్రతీకారం తీర్చుకునే తండ్రి రఘు పాత్రను పోషించాడు. వరుణ్ ధావన్ నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.
చివరగా బేబీ జాన్ చిత్రంలో నటించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించిన 2024 భారతీయ హిందీ భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇది అట్లీ 2016 తమిళ చిత్రం తేరికి రీమేక్‌గా వచ్చింది. చిత్రంలో వరుణ్ ధావన్‌తో పాటు కీర్తి సురేష్, వామికా గబ్బి, జరా జియాన్నా, జాకీ ష్రాఫ్ నటించి మెప్పించారు. ఇకపోతే ‘స్వర్గానికి వెళ్లే మార్గం నరకంలా అనిపిస్తుంది. నరకానికి దారి స్వర్గంలా అనిపిస్తుంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు.






