Katrina Kaif: సంతానం కోసం గుడుల చుట్టూ స్టార్ హీరోయిన్.. ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలు అందుకేనా?

by Chukka Sudharani |

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Katrina Kaif: సంతానం కోసం గుడుల చుట్టూ స్టార్ హీరోయిన్.. ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలు అందుకేనా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) ‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్‌(Bollywood)తో పాటు తెలుగు (Telugu), మలయాళం(Malayalam)లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అత్యంత పారితోషికం తీసుకుంటోన్న హీరోయిన్స్‌ (Heroines)లో ఒకటిగా ఉన్న కత్రినా కైఫ్.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ నటుడు విక్కీ కౌశల్‌(Vicky Kaushal)ని 2021లో పెళ్లి చేసుకుంది. వయసులో తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్‌తో పెళ్లి బందంలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌(Married life)ను ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో కత్రినా దేవాలయాలు, పూజలు (Temples and worship) అంటూ చాలా బిజీ అయిపోయింది. ఇక మొన్నటికి మొన్న కుంభమేళా(Kumbh Mela)లో పుణ్య స్నానాలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు కార్ణాటక(Karnataka)లోని ప్రసిద్ధి చెందిన కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయంలో కుటుంబంతో సహా దర్శనమిచ్చింది. అంతే కాకుండా సర్ప సంస్కార పూజలో పాల్గొంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. సంతానం కోసం ప్రత్యేక పూజలు, పుణ్య స్నానాలు చేస్తుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని యువతలకు త్వరలో వివాహం అవుతుందని, అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని చాలా మంది బలంగా నమ్ముతారు. ఇప్పుడు కత్రినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శంచడం, ప్రత్యే పూజలు నిర్వహించడం చూసి పిల్లలకోసం అంటున్నారు నెటిజన్లు.

Next Story