- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. బాలీవుడ్ నటికి పాజిటివ్
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా (Covid -19) మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా పాజిటివ్ (Corona Positive Cases) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా (Covid -19) మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాలతో పాటు భారత్‌లోనూ కరోనా పాజిటివ్ (Corona Positive Cases) కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ముంబై, చెన్నై, అహ్మదాబాద్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు పలు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదవ్వగా, మహారాష్ట్రలో డబుల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా.. బాలీవుడ్ నటి నికితా దత్తా (Nikita Dutta)కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తనకు, తన తల్లికి కూడా పాజిటివ్ వచ్చిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆ పోస్టులో పేర్కొంది. ఆహ్వానం లేకుండా వచ్చిన ఈ అతిథి ఎక్కువ రోజులు తమతో ఉండదని అనుకుంటున్నానని, చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దామని తెలిపింది. కాగా.. నికితా దత్తా ఇటీవలే జ్యువెల్ థీఫ్‌లో సైఫ్ అలిఖాన్‌తో కనిపించింది.
ఇక ఇటీవలే.. నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar) సిస్టర్, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Sirodkar)కు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆమె కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. అందరూ మాస్కులు వాడాలని సూచించారు. నమ్రతా ఆ పోస్టుకి గెట్ వెల్ సూన్ అని రిప్లై ఇచ్చింది.






