- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైరెక్ట్‌గా కుదరకపోతే కనీసం ఫోన్‌లో అయినా చూపించు అన్నారు..కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్
హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ ద్వారా తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ హెల్లీ షా.

దిశ, సినిమా: హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ ద్వారా తన నటనతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది యంగ్ బ్యూటీ హెల్లీ షా. ఇప్పుడు ఈ అమ్మడు గుజరాతీ మూవీ ‘దేడ’తో వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హెల్లీ.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. ‘నాకు ఓ పెద్ద సిరీస్‌లో ఆఫర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను అప్రోచ్ అవుతూ నాకు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి.. కన్ఫర్మేషన్ కోసం నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని అడిగాను. దానికి వాళ్లు.. ‘అవును.. అందుకే మీకు మెసేజ్ చేశాం.
అయితే.. మీరు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలంటే మేము చెప్పిన ప్లేస్‌కు వచ్చి.. చెప్పింది చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ సొంతం’ అని రిప్లై ఇచ్చారు. దానికి నేను ‘మీరు వేరే వాళ్లను చూసుకోండి’ అని రిప్లై ఇచ్చారు. అయినా కూడా అవతల వ్యక్తి ‘మీరు రాకపోయినా పర్వాలేదు. కనీసం ఫోన్‌లో అయినా చెప్పింది చేయండి’ అన్నారు. దీంతో నాకు ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. చాలా కోపం వచ్చింది. ఇదంతా నాకు ఎందుకు అనిపించి ఆ వ్యక్తి నెంబర్ బ్లాక్ చేశాను’ అని తెలిపింది.






