ఎట్టకేలకు తన లవ్ స్టోరీ చెప్పిన బాబి కొల్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో హైప్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ డైరెక్టర్ బాబి కొల్లి(Bobby Kolli) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఎట్టకేలకు తన లవ్ స్టోరీ చెప్పిన బాబి కొల్లి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌తో హైప్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ బాబి కొల్లి(Bobby Kolli) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన ఆయన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో ప్రజెంట్ ‘మెగా-158’(Mega-158) మూవీను తెరకెక్కిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’(Valtheru Veeraiah) చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ‘మన శంకరవర ప్రసాద్‌గారు’ సెట్స్‌ మీద ఉండగానే ఈ సినిమాను ప్రకటించారు.

ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి కావడంతో వీలైనంత త్వరగా సెట్స్‌ మీదకు తీసుకెళ్లడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తండ్రి, కూతురు కథతో ఆ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురి పాత్రలో సారా అర్జున్(Sara Arjun) కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ బాబికొల్లి తన లవ్‌స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఫస్ట్ ఇయర్‌లో ఉన్న నేను 9వ తరగతి చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించి, తన కూడా లవ్ చేసేలా చేసి, ఇండస్ట్రీకి వచ్చి రైటర్ అయి వాళ్ల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. 2002లో స్టార్ట్ చేసి 2011లో డేట్ సరిగ్గా చెప్పకపోతే మా ఆవిడ తన్ని బయటకేస్తది.. త్రివిక్రమ్ సినిమా ‘నువ్వే నువ్వే’(Nuvve Nuvve) ఉంది కదా శ్రీయ(Shreya) అండ్ తరుణ్(Tarun) గారిది ఆ సినిమా పాటలు తెగ వింటూ నేను ఇమాజిన్ చేసుకునే వాడిని’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story