- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mass Jatara: మాస్ జాతర షూటింగ్ అండ్ రిలీజ్‌పై బిగ్ అప్డేట్
మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రం ‘మాస్ జాతర’.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jatara). దీనికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, టీజర్, తూ మేరా లవర్ సాంగ్ వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్‌పై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఆగస్టు 27న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్‌గా ప్రకటించగా.. మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ రాలేదు. అలాగే రీసెంట్‌గా నిర్మాత నాగవంశీ కూడా త్వరలో రాబోతున్నాం అంటూ తెలిపారు కానీ డేట్ మాత్రం మెన్షన్ చేయలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడినట్లు క్లారటీ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ అండ్ షూటింగ్‌పై ఫిలిమ్ వర్గాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మేరకు ‘మాస్ జాతర ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉంది... స్ట్రైక్ అయిపోతే ఎల్లుండి నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో షూట్ చేస్తారు.. సెప్టెంబర్ 12 న రిలీజ్ అనుకుంటున్నారు. మోస్ట్‌లీ అదే డేట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్’ అంటూ వార్తలు వస్తున్నాయి. Link






