Ramayana: బాలీవుడ్ ‘రామాయణం’పై బిగ్ అప్‌డేట్.. షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో!

by Chukka Sudharani |   (  Updated:2025-05-02 11:55:15  IST  )

బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ (Ramayana) ఒకటి.

Ramayana: బాలీవుడ్ ‘రామాయణం’పై బిగ్ అప్‌డేట్.. షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో!
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులలో ‘రామాయణం’ (Ramayana) ఒకటి. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Nitish Tiwari) దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణం’లో రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించిన లుక్స్ కూడా నెట్టింట వైరల్ కాగా.. సూపర్ బజ్ క్రియేట్ అయింది. అంతే కాకుండా.. ఇందులో రావణుడిగా స్టార్ హీరో యష్ (Yash) నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ మరింత క్రియేట్ అయింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీని నమిత్ మల్హోత్రా‌తో కలిసి అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జె్ట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమా పార్ట్-1 2026 దీపావళి కానుకగా, పార్ట్-2 2027 దీపావళికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై(Mumbai)లో జరుగుతుందని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ యష్ సోలో సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుండగా.. త్వరలో సీత సాయిపల్లవితో, రాముడు రణ్‌బీర్ కపూర్‌తో, హనుమంతుడు సన్నీడియోల్‌ (Sunny Deol)తో షూటింగ్ సన్నివేశాల్లో పాల్గొననున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story