రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్& ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ పోస్ట్

by Gugulothu.Kavitha |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.

రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ నుంచి బిగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్& ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా ఆమె ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’(The Girlfriend). ఇందులో టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘రొమాన్స్, రిథమ్& రా ఎమోషన్.. ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది #నాదివే అనే ఉల్లాసభరితమైన మరియు మనోహరమైన పాటను రష్మిక, దీక్షిత్ అందించనున్నారు.. #ది గర్ల్‌ఫ్రెండ్ విడుదల తేదీ ప్రకటన & మొదటి సింగిల్ త్వరలో వస్తుంది’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి సాంగ్ రాబోతుంది అని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Link

Next Story