Rashmika: రష్మిక హారర్ చిత్రం ‘థామ’ నుంచి బిగ్ అప్డేట్..

by Chukka Sudharani |

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తుంది.

Rashmika: రష్మిక హారర్ చిత్రం ‘థామ’ నుంచి బిగ్ అప్డేట్..
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు అనౌన్స్ చేస్తుంది. ఈ హీరోయిన్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో ‘థామ’ (హిందీ) ఒకటి. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో నాల్గవ భాగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నాడు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్.. ‘ఒక ప్రేమకథ.. ఇంతకు ముందుకు చూసిన దానికంటే క్రూరంగా, ప్రాణాంతకంగా ఉంటుంది’ అంటూ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక దీపావళికి ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ‘థామ’ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 26న రాబోతున్నట్లు బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఈగర్‌గా వెయిటింగ్ అంటున్నారు నెటిజన్లు. కాగా.. 2018లో ‘స్త్రీ’ గా స్టార్ట్ అయిన ఈ హారర్ కామెడీ యూనివర్స్‌లో 2022లో భేడియా, 2024లో స్త్రీ-2, ఇప్పుడు నాల్గొవ భాగంగా ‘థామ’గా రాబోతుండగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లింక్


Next Story