- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Official: పవన్ కల్యాణ్ OG మూవీ నుంచి బిగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ మూవీస్‌లో ఓజీ(OG Movie) ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) అప్‌కమింగ్ మూవీస్‌లో ఓజీ(OG Movie) ఒకటి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్(Director Sujith) తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మిస్తుండగా, ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. ఓజీ మీ అందరినీ ఆశ్చర్యపరచబోతోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇందులో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇందులో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో 'ఓజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






