ప్ర‌భాస్ కు బిగ్ షాక్‌..బాహుబలి-2 రికార్డు బద్దలైంది

by velandi.Saikiran |   (  Updated:2026-04-24 07:32:40  IST  )

ప్ర‌భాస్ కు బిగ్ షాక్‌..బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసింది బాలీవుడ్ మూవీ ధురంద‌ర్‌.

ప్ర‌భాస్ కు బిగ్ షాక్‌..బాహుబలి-2 రికార్డు బద్దలైంది
X

దిశ‌, వెబ్ డెస్క్: ధురంధ‌ర్ 2 సినిమా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. మొన్న ఉగాది రిలీజ్ అయిన ఈ సినిమాలో కోట్లల్లో క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ధురంధ‌ర్ 2 సినిమా, ఇక తాజాగా ప్ర‌భాస్ కు షాకిచ్చింది. ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి 2 సినిమా వ‌సూళ్ల రికార్డును బ్రేక్ చేసింది ధురంధ‌ర్ 2. గ‌తంలో బాహుబ‌లి 2 రూ.1810 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా రూ.1812 కోట్లు రాబ‌ట్టింది ధురంధ‌ర్ 2. ఇక రూ.2 వేల కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌తో దంగ‌ల్ టాప్ లో ఉంది. ఈ త‌రుణంలోనే ఇండియ‌న్ హిస్ట‌రీలో రెండో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా ధురంధ‌ర్ 2 రికార్డు సృష్టించింది. ఇంకా థియేట‌ర్ల‌లో ఉండ‌టంతో క‌లెక్ష‌న్స్ పెరిగే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏమౌవుతుందో చూడాలి.

అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాలు

దంగల్ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ సినిమా ఎక్కువగా చైనాలో ఎక్కువగా కలెక్షన్స్ తీసుకు వచ్చినట్లు నివేదికను చెబుతున్నాయి. ఆ తర్వాత ధురంధర్ 2 రూ.1812 కోట్లతో ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. బాహుబలి 2 సినిమా రూ.1810 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. RRR సినిమాకు రూ.1300 కోట్లు వచ్చాయి. ఈ సినిమా 4వ స్థానంలో నిలిచింది.

Next Story