- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో అఖండ-2కు బిగ్ షాక్.. టికెట్ ధరల పెంపుపై పిటిషన్
తెలంగాణలో బాలకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో బాలకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ని న్యాయస్థానం విచారణకు అనుమతించింది. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై సైతం న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అఖండ సినిమా విడుదల కావాల్సి ఉండగా నిర్మాతల మధ్య పంచాయితీ కారణంగా వాయిదా పడింది.
దీంతో నేడు ఈ సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. రాత్రి 8గంటలకు ప్రీమియర్స్ వేయాల్సి ఉంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. అయితే తెలంగాణలో ఇచ్చిన జీవో ప్రకారం అఖండ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా ఉంది. అంతే కాకుండా ఈ నెల 12 నుండి 14 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.100 టికెట్ ధరకు అదనంగా పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పుడు పిటిషన్ వేయడంతో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.






