- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడు డబుల్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్
అక్కినేని అఖిల్(Akhil), నాగార్జున(Nagarjuna) తనయుడిగా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చాడు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akhil), నాగార్జున(Nagarjuna) తనయుడిగా ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చాడు. ఆ తర్వాత ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారి పలు మూవీస్ చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆయన చేసిన చిత్రాలు హిట్ సాధించకపోవడంతో పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయాడు. దీంతో కొన్ని సినిమాలే చేశాడు. ఇక అఖిల్ నటించిన ‘ఏజెంట్’ (Agent)భారీ డిజాస్టర్ కావడంతో ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయింది. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే.. అఖిల్ జైనబ్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. ఆయన సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘లెనిన్’(Lenin) సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేశాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళి కిశోర్ అబ్బూరు(Kiran Murali Kishore Abburu) తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రముఖ నిర్మాత నాగవంశీ అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. అఖిల్ నటిస్తున్న తన నెక్ట్స్ మూవీ నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్,గ్లింప్స్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ‘అఖిల్-6’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.






