అభిమానులకు రవితేజ క్రిస్మస్ కానుక

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్

అభిమానులకు రవితేజ క్రిస్మస్ కానుక
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మాసివ్ బజ్‌ క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ క్రిస్మస్ విషెస్ అందిస్తూ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ సాంటా క్యాప్ పెట్టుకుని, చేతిలో గిఫ్ట్ పట్టుకుని ఫెస్టివ్ వైబ్‌లో కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది. జనవరి 13న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీగా ప్రేక్షకుల్ని అలరించబోతుంది.

Next Story