సంక్రాంతి బరిలో రవితేజ..

by Sujitha Rachapalli |

మాస్ మహరాజా రవితేజ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న మూవీలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు కాగా ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ

సంక్రాంతి బరిలో రవితేజ..
X

దిశ, సినిమా : మాస్ మహరాజా రవితేజ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న మూవీలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లు కాగా ఈ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. భార్యాభర్తల సంబంధాలు, భర్తల బాధలు, ఆధునిక జీవితంలో వచ్చే సమస్యలను హాస్యాత్మకంగా చూపించే ఈ కథను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రామ సత్యనారాయణ... తన జీవితంలోని అంచనాలు మరియు బాధ్యతలతో సతమతమవుతాడు. అతని వైన్ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడంతో స్పెయిన్ వెళ్తాడు. అక్కడ మానసను కలుస్తాడు. గర్ల్ ఫ్రెండ్‌గా సెట్ చేసుకుంటాడు. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి అయిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లో భార్య, బయట గర్ల్‌ఫ్రెండ్ మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఆధునిక సలహాలు, పాత జ్ఞానంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వాటిని ఎలా హ్యాండిల్ చేశాడు? అనేది హాస్యాస్మతంగా మలిచాడు డైరెక్టర్.

Next Story