కోలీవుడ్ వైపు భాగ్యశ్రీ భోర్సే అడుగులు.. ఈ యంగ్ బ్యూటీకి అక్కడైన కలిసొచ్చేనా?

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తమిళంలో మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కోలీవుడ్ వైపు భాగ్యశ్రీ భోర్సే అడుగులు.. ఈ యంగ్ బ్యూటీకి అక్కడైన కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. అందం, అభినయం, నటనతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి పరిస్థితిలోనే ఉంది యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు ఆమెకు సరైన హిట్ రాలేదు. కొన్ని సినిమాలు విజయానికి దగ్గరగా వెళ్లినప్పటికీ భాగ్యశ్రీకి మాత్రం కలిసి రావడం లేదు. ప్రజెంట్ తెలుగులో అఖిల్ ‘లెనిల్’ చిత్రంలో నటిస్తుంది. కానీ ఈ సినిమా కూడా వాయిదాలపై నడుస్తుండటంతో.. ఇప్పుడు ఈ అమ్మడు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. తమిళంలో ప్రయత్నం చేయాలని భావించిన ఈ హీరోయిన్ రీసెంట్‌గా కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, దర్శకుడు శివకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సెయాన్’ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీని కమల్ హాసన్ తన బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో భాగ్యశ్రీ భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాతో అయినా ఈ హీరోయిన్ కెరీర్ టర్న్ అవుతుందేమో వేచి చూడాల్సి ఉంది.

Next Story