OTT:రిలీజ్‌కు ముందే క్రేజ్ క్రియేట్ చేస్తున్న రాఘవా లారెన్స్ మూవీ..

by Chukka Sudharani |

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతా.. ఇలా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవా లారెన్స్.

OTT:రిలీజ్‌కు ముందే క్రేజ్ క్రియేట్ చేస్తున్న రాఘవా లారెన్స్ మూవీ..
X

దిశ, సినిమా: కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతా.. ఇలా మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). భాషతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈయన ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోతో హైప్ పెంచేశాడు. అంతే కాకుండా.. ‘ఒక కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు’ అనే క్యాప్షన్ ఇచ్చిన షేర్ చేసిన ఈ ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

దీంతో ఈ సినిమాను నుంచి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులతో పాటు.. రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుపగా.. తాజాగా ఓటీటీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ సినిమాపై మరన్ని ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Next Story