- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishkindhapuri : పవర్ ఫుల్ వాయిస్‌తో డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో.. నెట్టింట పోస్టర్ వైరల్
‘భైరవం’ చిత్రంతో హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas)..

దిశ, సినిమా: ‘భైరవం’ చిత్రంతో హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas).. నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri ). హారర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ ఫైమ్ డైరెక్టర్ కౌషిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.
ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్‌ను షేర్ చేస్తూ.. ‘తన పవర్ ఫుల్ వాయిస్‌తో ‘కిష్కింధపురి’ వింత ప్రపంచానికి తనదైన ముద్ర వేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతున్నది’ అంటూ తెలిపారు. లింక్






