- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇటీవల ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తర్వలో ‘కిష్కింధపురి’ చిత్రంతో రాబోతున్నాడు.

దిశ, సినిమా: ఇటీవల ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తర్వలో ‘కిష్కింధపురి’ చిత్రంతో రాబోతున్నాడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. మంత్రాలతో మూసివేయబడిన ఒక పాత మహాల్‌లోకి హీరో కొంతమంది వ్యక్తులతో లోపలికి వెళ్తాడు.
తర్వాత అక్కడ అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవి మరింత ఉత్కంఠను పెంచే విధంగా ఉండటంతో గ్లింప్స్‌తో మూవీపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో ‘కిష్కింధపురి’ సినిమా థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్‌గా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్






