- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Beauty: ‘బ్యూటీ’ టీజర్ రిలీజ్.. యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న విజువల్స్!
డైరెక్టర్ మారుతి (Director Maruti) ప్రజెంటర్‌గా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘బ్యూటీ’ (Beauty).

దిశ, సినిమా: డైరెక్టర్ మారుతి (Director Maruti) ప్రజెంటర్‌గా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘బ్యూటీ’ (Beauty). ఇందులో అంకిత్ కొయ్య (Ankit koya), విశాఖ ధిమన్ (Visakha Dhiman) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ (First look), మోషన్ పోస్టర్ (Motion poster) అందరిలోనూ ‘బ్యూటీ’పై ఆసక్తిని పెంచింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ (Teaser)ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. మరింతగా ఆసక్తిని పెంచేసింది. ఓ అందమైన ప్రేమ కథతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ని కూడా చూపిస్తూ టీజర్ ఎంతో బ్యూటీఫుల్‌గా, ప్లెజెంట్‌గా టీజర్ కట్ చేశారు మేకర్స్. టీజర్ విషయానికి వస్తే.. ఓ స్కూటీ చుట్టూనే ఈ కథ తిరిగేలా ఉంది. స్కూటీ వచ్చాకా? ఏం జరుగుతుంది? అసలు హీరోయిన్ స్కూటీని ఎందుకు అడుగుతోంది..? ఆ స్కూటీ వచ్చాక హీరోయిన్‌లో వచ్చే మార్పులు ఏంటి? ఈ ప్రేమ కథలో ఎలాంటి ట్విస్టులు వస్తాయి.. అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను బ్యూటీఫుల్‌గా కట్ చేశారు. ఇక టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. ‘లైఫ్‌లో నిన్ను ఇంకేం అడగను’ అనే డైలాగ్‌కు సినిమాలో చాలానే ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది. మొత్తంగా ఈ టీజర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.






