Bandla Ganesh: ఆస్కార్ నటులు ఎక్కవైపోయారంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. దిల్ రాజును ఉద్దేశించేనా..?

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-15 12:52:37  IST  )

గత కొన్ని రోజుల నుంచి థియేటర్స్ బంద్ కానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్యవివాదం కొనసాగుతోంది.

Bandla Ganesh: ఆస్కార్ నటులు ఎక్కవైపోయారంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్.. దిల్ రాజును ఉద్దేశించేనా..?
X

దిశ, సినిమా: గత కొన్ని రోజుల నుంచి థియేటర్స్ బంద్ కానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్యవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ లేఖ విడుదల చేయడంతో వివాదం కాస్త ముదిరింది. నిర్మాతలు టికెట్ రేట్స్ కోసం మాత్రమే వస్తారంటూ ఫైర్ అయ్యారు. ఇక దీనిపై టాలీవుడ్ నిర్మాతలు ఒక్కొరొక్కరుగా స్పందిస్తున్నారు. ఈక్రమంలో.. దిల్ రాజు (dilraju) ప్రెస్ మీట్ పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్ల నుంచి మొదలైంది. థియేటర్లలో 90 శాతం సినిమాలు పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్నారు. రెండ్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు సమస్య ఉందని తెలిపారు.

ఈ విధానం తెలంగాణలో కూడా వస్తే.. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు తెలంగాణలో కూడా 270 థియేటర్లు కూడా మూత పడుతున్నాయని ఎగ్జిబిటర్లు అడిగారని అంటున్నారని దిల్ రాజ్ అన్నారు. అయితే సినీ పెద్దల పంచాయతీ అప్పుడిప్పుడే సర్దుమనిగేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనూ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఓ సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘‘ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం...’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్ ఆయన దిల్ రాజును ఉద్దేశించే అన్నాడని నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఇక బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది తెలియనప్పటికీ ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Next Story