హ్యాపీ బర్త్ డే ‘రాజమ్మ’.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

by Sujitha Rachapalli |

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు సి

హ్యాపీ బర్త్ డే ‘రాజమ్మ’.. సోషల్ మీడియాలో ట్రెండింగ్
X

దిశ, సినిమా : ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌లు అందుకున్న‌ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ హ‌ర్ష్ రోష‌న్, బ్యూటీఫుల్ శ్రీదేవి అప‌ళ్ల జోడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేయ‌నున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఈ క్రేజీ కాంబోను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండగా.. కావ్య‌, శ్రావ్య చిత్రానికి నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ‘బ్యాండ్ మేళం’ సినిమాకు ‘ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్’ అనేది ట్యాగ్ లైన్. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచింది. తాజాగా శ్రీదేవి బ‌ర్త్‌డేను మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా చేయ‌టానికి మేక‌ర్స్ సినిమా నుంచి బ‌ర్త్ డే గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ‘రాజమ్మ’ అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ విష్ చేశారు. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్నట్లు తెలిపారు. శివ‌రాజు ప్ర‌ణ‌వ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్పిస్తుంది. సంగీతం, ప్రేమ‌, భావోద్వేగాల క‌ల‌యిక‌గా రూపొందుతోన్న ఈ అంద‌మైన క‌థ‌కు స‌తీష్ జ‌వ్వాజి దర్శకుడు. కాగా టాలెంటెడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ సాయికుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు.

Next Story