బాలయ్య‌ సినిమాలో మారింది హీరోయిన్ ఒక్క‌రే కాదు..అస‌లు ట్విస్ట్ ఇదే !

by velandi.Saikiran |

బాలకృష్ణ, గోపిచంద్ మ‌లినేని సినిమాలో మారింది హీరోయిన్ కాదు...ఏకంగా స్టోరీనే మార్చిన‌ట్లు టాక్.

బాలయ్య‌ సినిమాలో మారింది హీరోయిన్ ఒక్క‌రే కాదు..అస‌లు ట్విస్ట్ ఇదే !
X

దిశ‌, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న నందమూరి బాలయ్య... అటు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఏడాదికి ఒక్క సినిమా ఆయన రిలీజ్ చేసి.. చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు బాలయ్య. అయితే అలాంటి బాలయ్య ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు కానీ, అనేక రకాల రూమర్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ను మార్చార‌ని సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి.

నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ ?

ఈ ప్రాజెక్టు కోసం మొదట నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి క్షణంలో నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్ ఫైనల్ అయినట్లు మళ్లీ ఇప్పుడు కొత్త అంశం తెర పైకి వచ్చింది. అయితే హీరోయిన్లను మార్చడం వెనుక పెద్ద కథ జరిగినట్లు తెలుస్తోంది. నయనతార స్థానంలో కాజల్ ను తీసుకోవడం వెనుక స్క్రిప్ట్ లో మార్పులు అని తెలుస్తోంది. మొదట చారిత్రాక నేపథ్యంలో సినిమా తీసేందుకు దర్శకుడు గోపీచంద్ నిర్ణయం తీసుకున్నాడట. ఇందులో రాణి పాత్ర కోసం నయనతారను సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే చివరి క్షణంలో ఏం జరిగిందో తెలియదు కానీ కథ మార్చేసి... ఇప్పుడు గ్యాంగ్ స్టార్ స్క్రిప్ట్ ను తీస్తున్నారట. ఈ క‌థ‌ కోసం మళ్లీ కాజల్ పేరును తెరపైకి తీసుకువచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

Next Story