- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 ఘన విజయం సాధించాలని తిరుపతిలో అభిమానుల ప్రత్యేక పూజలు
టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ముఖ్యమైన పాత్రలో నటించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ముఖ్యమైన పాత్రలో నటించింది. బాలయ్యకు హ్యాట్రిక్ విజయాలు అందించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతే కాకుండా ఈ చిత్రానికి కూడా తమన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా నిర్మాణ సంస్థల మధ్య ఆర్థికలావాదేవీల కారణంగా వాయిదా పడింది.
ఇక కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో విడుదల తేదీపై స్పష్టత రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ చేయాలనుకుంటే వాయిదా పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాజాగా నేడు బాలయ్య అభిమానులు తిరుపతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని అలిపిరి శ్రీవారి పాదాల చెంత 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల తరవాత బాలయ్య ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది.






