Daaku Maharaj: బాలకృష్ణ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

by Mallepaka Hamsa |

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).

Daaku Maharaj: బాలకృష్ణ కెరియర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఇందులో శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath), ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా.. చాందిని చౌదరి(Chandni Chowdhury), బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇందులో బాలయ్య సరసన ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఐటమ్ సాంగ్‌లో చెందులేసింది. దీనిని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sithara Entertainments), ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ(Naga Vamsi) నిర్మించారు.

అయితే ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 56 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అయితే బాలయ్య కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘డాకు మహారాజ్’ నిలవడం విశేషం. ప్రస్తుతం మేకర్స్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నందమూరి అభిమానులు సంతోష పడుతున్నారు.

Next Story