- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలర్-2.. ఈ సారి థియేటర్లు కాలిపోవడం పక్కా..!
‘జైలర్ 2’లో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బాలయ్య ఓకే చెప్పినట్టు చెన్నై ఫిలిం వర్గాల్లో చర్చ.

దిశ, వెబ్ డెస్క్: ‘జైలర్ 2’లో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బాలయ్య ఓకే చెప్పినట్టు చెన్నై ఫిలిం వర్గాల్లో చర్చ. పాత్ర ప్రాధాన్యం దృష్ట్యా అతనికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు వినిపిస్తోంది – సుమారు రూ. 20 కోట్ల వరకూ ఉండొచ్చని గుసగుసలు. మొదటి భాగంలో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్‌లు స్పెషల్ గెస్ట్‌లుగా మెరిశారు. కానీ తెలుగు నుండి ఎవ్వరూ లేకపోవడం కొంత లోటుగా అనిపించింది. ఇప్పటికి ఆ లోటు తీరనుందన్న ఉత్సాహం ఉంది. నెల్సన్ దిలీప్ కుమార్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలకృష్ణను ‘జైలర్ 1’లో తీసుకోవాలనుకున్నానని కానీ అది వీలుకాలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం విషయం కుదిరిపోయింది.
ఇక అసలైన హైప్ ఇచ్చే విషయమే వేరు. లీక్ అయిన సమాచారం ప్రకారం, బాలకృష్ణ ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. రజనీకాంత్ పాత్ర ముత్తువేల్ పాండియన్ ఫ్లాష్‌బ్యాక్‌లో ఇద్దరూ యూనిఫార్మ్‌లో కనిపించే సన్నివేశాలు స్క్రిప్ట్‌లో బాగా వర్కౌట్ అయ్యాయట. బాలయ్యకి గుర్తుండిపోయే ‘లక్ష్మీ నరసింహ’ అనే పాత్ర పేరునే ఇక్కడ ఉపయోగించే అవకాశముందని అంటున్నారు. మొదటగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ రామరాజు పేరు పరిశీలించినా, చివరికి నెల్సన్ ‘లక్ష్మీ నరసింహ’ పేరునే ఫిక్స్ చేశాడట. ఈ ప్రెస్టిజియస్ కాంబినేషన్‌ని నెల్సన్ భారీ మాస్ ఎలివేషన్లతో తెరకెక్కించనున్నాడన్నది ఖాయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. మొదట సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసినా, విజయ్ హీరోగా వస్తున్న ‘జన గణ మన’ సినిమా దృష్టిలో ఉంచుకొని, ‘జైలర్ 2’ని 2026 వేసవి బరిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతేగాక, ‘కూలి’తో కేవలం అయిదే నెలల గ్యాప్ ఉండటంతో సమ్మర్ డేట్ మరింత సజీవంగా మారింది.ఇంకా చిత్రీకరణ సగం కూడా పూర్తికాకముందే ‘జైలర్ 2’కు తెలుగు హక్కులపై భారీ ఆసక్తి నెలకొంది. ఒప్పందాలు ఇంకా ఫైనల్ కాలేదు కానీ, మార్కెట్‌లో డిమాండ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.






