- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chiyan Vikram: విక్రమ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్
చియాన్ విక్రమ్ (Chiyan Vikram)నటిస్తున్న ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram)సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అవుతుంది.

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ (Chiyan Vikram)నటిస్తున్న ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram)సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ ఈ మూవీ విడుదల నోచుకోవడంతో లేదు. ఏదో కారణంతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. అయితే గత కొన్నేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.
ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ 2025 పొంగల్‌కు విడుదల కాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో విక్రమ్ అభిమానులు ఇన్నాళ్లకు ‘ధృవ నక్షత్రం’(Dhruva Nakshatram) సినిమాకు మోక్షం కలిగిందని సంతోష పడ్డారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautam Vasudev Menon) ఓ పోస్ట్‌తో షాకిచ్చారు. ‘ధృవ నక్షత్రం’ పొంగల్‌కు విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు వెల్లడించారు.
#DhruvaNatchathiram ❤🙏 pic.twitter.com/B5UwlPclLB
— gauthamvasudevemenon🧢 (@menongauthami) January 10, 2025






