- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోనున్న ‘OG’ షూటింగ్?
పవన్ కల్యాణ్(Pawan Kalyan) - సుజిత్(Sujeeth) కాంబినేషన్‌లో వస్తోన్న ఓజీ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్(Pawan Kalyan) - సుజిత్(Sujeeth) కాంబినేషన్‌లో వస్తోన్న ఓజీ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో విజువల్స్ కూడా ఇవాళ నెట్టింట వైరల్ అయ్యాయి. అనూహ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి(Emraan Hashmi) అనారోగ్యం బారినపడ్డారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ఇవాళ షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే.. తాజాగా పవన్ - ఇమ్రాన్ హష్మి మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పవన్ డేట్స్ ఇవ్వడం, చిత్రం పట్టాలెక్కడం, ఇంతలోనే నటుడు అనారోగ్యం బారినపడటంతో పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మళ్లీ సార్ షూటింగ్‌కు వచ్చేది ఎప్పుడు.. ఇదంతా పూర్తయ్యేది ఎప్పుడు’ అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఓజీ చిత్రాన్ని(OG Movie) డీడీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ప్రియాంక మోహన్ఉ(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిసక్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే వచ్చే సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాత అధికారికంగా ప్రకటించారు.
#OG shoot halts in middle#PawanKalyan pic.twitter.com/sZ8IdCwMSP
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 28, 2025






