- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'బాహుబలి ది ఎపిక్' ట్రైలర్.. రన్టైమ్ ఎంతంటే?
బాహుబలి ది ఎపిక్ సినిమా రన్ టైంను మూడు గంటల 44 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో, బాహుబలి 2 కూడా ఓ రేంజ్ కు వెళ్ళింది. కలెక్షన్స్ ఇరగదీసింది. అయితే రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు.
బాహుబలి ది ఎపిక్ ( Baahubali: The Epic )పేరుతో సింగిల్ పార్ట్ లో రిలీజ్ చేస్తున్నారు. అంటే రెండు సినిమాలను కలిపి, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఒకేసారి రిలీజ్ చేస్తారన్నమాట. ఈ నేపథ్యంలోనే రన్ టైం గురించి చర్చ జరుగుతోంది. U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ బాహుబలి ది ఎపిక్ సినిమా రన్ టైంను మూడు గంటల 44 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
దీంతో ఇండియన్ చరిత్రలో ఎక్కువ రన్ టైం ఉన్న సినిమాగా బాహుబలి ది ఎపిక్ రికార్డు సృష్టించింది. బాహుబలి రెండు పార్టులు మొత్తం కలిపి 5 గంటల 27 నిమిషాలు. అయితే ఇందులో చాలా వరకు ఎడిటింగ్ చేసి రన్ టైం తగ్గించి, ఒకే పార్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31వ తేదీన ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రెండు రోజుల ముందే యూఎస్ లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తారు. మరి ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.






