యూట్యూబ్ ను షేక్ చేస్తున్న 'బాహుబలి: ది ఎపిక్' కొత్త ట్రైలర్

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:47:30  IST  )

బాహుబలి ది ఎపిక్ పేరుతో ( Baahubali - The Epic) అక్టోబర్ 31వ తేదీ అంటే ఎల్లుండి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న  బాహుబలి: ది ఎపిక్  కొత్త ట్రైలర్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 బంపర్ విజయం సాధించడమే కాకుండా కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టాయి. అయితే ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. రెండు భాగాలను కలిపి, ఒకే సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో ( Baahubali - The Epic) అక్టోబర్ 31వ తేదీ అంటే ఎల్లుండి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో పాటు ట్రైలర్ 1 ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. లేటెస్ట్ గా ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేసింది. ఇక యూట్యూబ్ లోకి వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైల‌ర్ లో పార్ట్‌1, పార్ట్ 2 లోని క‌థ‌నాలు క‌లిపి, పెట్టారు. దీంతో జ‌నాల‌ను సీన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా బాహుబలి ది ఎపిక్ ర‌న్ టైం 3 గంట‌ల 44 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.

Next Story