Saif Alikhan : సైఫ్ పై దాడి.. ఆ కత్తి ఎవరు ఇచ్చారో తెలుసా?

by Muthe.Rajitha |

ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై ఓ దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

Saif Alikhan : సైఫ్ పై దాడి.. ఆ కత్తి ఎవరు ఇచ్చారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై ఓ దుండగుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన దుండగుడు షరిపుల్(Sharipul) పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ చేపట్టగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్ పై దాడికి పాల్పడిన దుండగుడు ఆ కత్తి(Knife)ని ఓ హోటల్ నుంచి దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. ఆ కత్తిలో.. ఒక ముక్క సైఫ్ వెన్నుముఖలో ఇరుక్కు పోగా.. మరో ముక్క సైఫ్ ఇంట్లోనే దొరికింది. దానిలో మరో ముక్కను దాడి అనంతరం షరిపుల్ దగ్గరలో ఉన్న చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్ళి అందులో పడేశాడు. అనంతరం నేషనల్ కాలేజీ వద్ద నిద్రపోగా, ఉదయం దాదర్ వెళ్లేందుకు బాంద్రా రైల్వే స్టేషన్(Bandra Railway Station) కు వెళ్ళాడు. ఈ దాడిపై పోలీసులు ఇటీవల సీన్ రిక్రియేషన్ నిర్వహించారు. నిండుతుడు వాడిన దుస్తులు, మరికొన్ని వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ముంబయిలోని బాంద్రా లాంటి అత్యంత భద్రత ఉండే ఏరియాలో.. ఓ ప్రముఖ హీరో మీద దాడి జరగడం.. దేశంలో సంచలనం రేపింది.

Next Story