- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విడాకులు తీసుకుని కనీసం వారం కాకముందే అప్పుడే కలవాలంటున్న స్టార్ నటుడు
బుల్లితెర నటి చారు అసోపా, రాజీవ్ సేన్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి చారు అసోపా, రాజీవ్ సేన్ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. డివోర్స్ తీసుకుని తాను మంచి పని చేశానంటూ చారు అభిప్రాయపడుతుండగా.. రాజీవ్ మాత్రం చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకుంటున్న టైమ్‌లో కూడా ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ కూడా చేశాడు. అయితే రాజీవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై.. ‘‘మేమిద్దరం కలిసి ఉండనంత మాత్రాన నా కుమార్తపై ప్రేమ అస్సలు తగ్గదు. నా బిడ్డ విషయంలో మేము ఒకరికి ఒకరం మద్దతుగా ఉంటాం. ఒక తండ్రిగా నా కూతురికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చారు క్షేమాన్నే కోరుకుంటాను. అలాగే తనకు ఎప్పుడూ అండగా ఉంటాను. తనపై నా ప్రేమ అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు మేము మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను.’’ అంటూ వెల్లడించారు.
Next Story






