రోజుకు 80 రేప్‌లు, లైంగిక వేధింపులు.. తాప్సీ సినిమా సంచలనం

by Sujitha Rachapalli |

బ్యూటిఫుల్ తాప్సీ కథల ఎంపికలో మరింత ఆచూతూచి వ్యవహరిస్తోంది. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ‘అస్సీ’కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.

రోజుకు 80 రేప్‌లు, లైంగిక వేధింపులు.. తాప్సీ సినిమా సంచలనం
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ తాప్సీ కథల ఎంపికలో మరింత ఆచూతూచి వ్యవహరిస్తోంది. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ‘అస్సీ’కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. అనుభవ్ సిన్హా డైరెక్షన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముగ్గురు అబ్బాయిలు ఓ అమ్మాయి వెంటపడి పరుగెడుతున్న మోషన్ పోస్టర్.. రక్తంతో నిండిన తాప్సీ ముఖం.. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తోంది. భారతదేశంలో సగటున రోజుకు 80 లైంగిక వేధింపులు, రేప్‌లు జరుగుతున్నాయనేది మూవీ మెయిన్ థీమ్‌గా కనిపిస్తుండగా.. హార్ట్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది మూవీ. కాగా ఇందులో తాప్సీ లాయర్‌గా కనిపించబోతుండటం విశేషం. కాగా ఈ సినిమా ఓ అమ్మాయి రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడం, దాని పరిణామాల గురించి సూచిస్తుంది. ‘సమాజం మరిచిపోతుంది.. క్షమిస్తుంది.. కానీ ఈ సారి కాదు’ అంటూ వదిలిన మోషన్ పోస్టర్ అనుభవ్ సిన్హా స్టైల్‌లో మరో సామాజిక లోపాన్ని ఎత్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story