- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా తల్లి చివరి క్షణాల్లో నీళ్లు అడిగింది.. కానీ నేను ఇవ్వలేదు.. నా కారణంగానే చనిపోయింది.. ప్రముఖ నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ 14ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను ఎలా మోయాల్సి వచ్చిందో వివరించాడు. ప్రముఖ పాడ్ కాస్ట్ ‘ఫిగరింగ్ అవుట్’లో తన తల్లిదండ్రుల మరణం, కుటుంబ పరిస్థితులు తారుమారు కావడం గురించి చెప్పుకొచ్చాడు. తాము పెద్ద

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ 14ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతలను ఎలా మోయాల్సి వచ్చిందో వివరించాడు. ప్రముఖ పాడ్ కాస్ట్ ‘ఫిగరింగ్ అవుట్’లో తన తల్లిదండ్రుల మరణం, కుటుంబ పరిస్థితులు తారుమారు కావడం గురించి చెప్పుకొచ్చాడు. తాము పెద్ద కుటుంబానికి చెందిన వారమని బోర్డింగ్ స్కూల్‌లో చదువుతూ హాలిడేస్‌కు ఇంటికి వచ్చేవాడని చెప్పాడు నటుడు. కానీ ఉన్నట్లుండి తల్లికి కిడ్నీ ఫెయిల్ కావడం.. తండ్రి ఆర్థికంగా దిగజారిపోవడం జరిగిందని తెలిపాడు. తల్లిని డయాలసిస్ కోసం ఆస్పత్రిలో చేర్పించామని.. నీళ్లు అడిగితే ఇవ్వకూడదని లేదంటే పరిస్థితి మరింత చేజారుతుందని డాక్టర్లు తెలిపారని చెప్పాడు. అయితే తన తల్లి పదే పదే నీళ్లు అడిగినా.. తాను ఇవ్వలేదని.. తను ఒక్క చుక్క అయినా ఇవ్వమని బెగ్ చేసిందని.. కానీ తాను వినలేదని.. అదే రోజు ఆమె చనిపోయిందని తెలిపాడు. ఆ ఘటన ఇప్పటికీ తనను వేధిస్తుందని.. నీళ్లు ఇస్తే ఏమవుతుండే .. తల్లి మరణానికి తనే కారణమా?.. అనే బాధ ఇప్పటికీ కలిచివేస్తుందని చెప్పాడు.
తల్లి చనిపోయిన కొద్ది రోజులకే తండ్రి కూడా మరణించాడని.. దీంతో కుటుంబంలో పెద్ద వాడినైన తను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. పెద్ద ఇంటి నుంచి చిన్న ఇంట్లోకి మారామని.. ప్రతీ విషయంలో పరీక్షలు ఎదుర్కొన్నామని చెప్పాడు. ఇక ఈ అనుభవం గురించి పంచుకున్న నటుడి మాటలు చాలా ఆలోచింపజేస్తున్నాయని.. ఆయన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు నెటిజన్లు.






