- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శంబాల’ ప్రీమియర్స్‌కు భారీ రెస్పాన్స్
వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల : ఎ మిస్టిక్ వరల్డ్’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే మూవీ ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా హీరోయిన్ అర్చన ఐయ్యర్

దిశ, సినిమా : వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల : ఎ మిస్టిక్ వరల్డ్’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే మూవీ ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా హీరోయిన్ అర్చన ఐయ్యర్ మీడియాతో ముచ్చటించారు. ‘‘శంబాల’కు మంచి స్పందన వస్తోంది. వేసిన ప్రతీ ప్రీమియర్ హౌస్ ఫుల్ అవుతోంది. చాలా చోట్ల ఆడియన్స్ భయపడిపోతున్నారు. నా పాత్రను బాగా ఆదరిస్తున్నారు. నేను కనిపించిన ప్రతీ సారి ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆదితో నా కాంబినేషన్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ‘శంబాల’ నెరేషన్ పూర్తిగా వినకుండానే ఓకే చేశాను. ఇందులో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. రొమాంటిక్ పాటలు, స్టెప్పులు వేసే పాత్ర కాదని ముందే చెప్పారు. ఇలాంటి డిఫరెంట్ పాత్ర నా కెరీర్ ఆరంభంలోనే రావడం ఆనందంగా ఉంది. మా నిర్మాతలు మాకెంతో సపోర్ట్ చేశారు. మధ్యలో బడ్జెట్ పెరిగినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్‌గా నిర్మించారు. మా ఆర్టిస్టులందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. వారిచ్చిన సహకారంతోనే అందరం బాగా నటించగలిగాం’ అని తెలిపింది.






