- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apparao: ఆ తప్పు చేయడం వల్లే షకలక శంకర్ ఆ పరిస్థితుల్లో ఉన్నాడు
అప్పారావు మాట్లాడుతూ… శంకర్ గారు ఈవెంట్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఆయన పెద్ద స్థాయిలో డబ్బు సంపాదించలేకపోయారని చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకొని, ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న వారిలో అప్పారావు ఒకరు. ఈయన షకలక శంకర్ టీం ద్వారా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శంకర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోయాక కూడా అప్పారావు ఆ షోలో కంటిన్యూ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కమెడియన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని శంకర్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
అప్పారావు మాట్లాడుతూ…"నాకు అవకాశం ఇచ్చి నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారకులు శంకర్ గారు. ఆయన లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. అందుకే ఆయన పేరును నా ఫోన్‌లో 'దేవుడు' అని సేవ్ చేసుకున్నాను" అని భావోద్వేగంగా తెలిపారు. అలాగే జబర్దస్త్‌లోకి వచ్చిన కొత్తలో శంకర్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని, ఆయన ప్రోత్సాహం వల్ల మరింత ఉత్సాహం వచ్చేదని అప్పారావు చెప్పారు. ఇక చాలా మంది ఈవెంట్లకు వెళ్లి డబ్బులు సంపాదిస్తుంటారని, కానీ శంకర్ మాత్రం "మనము సినిమాల్లో నటించడానికి వచ్చాం… అదే పని చేయాలి" అనే ఆలోచనతో ఈవెంట్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. అదే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటే శంకర్ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించేవారని అప్పారావు పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పారావు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






